Tuesday, January 19, 2016


                       బండకాడిఅంజయ్య గౌడ్
                వెంకట్రావు పేట, మం.తొగుట, జి.మెదక్

ఆరవతరగతికి,ఆగిపోయెచదువు
కవిత,వ్రాయగానుకాంక్షబుట్టి
ఆ.వె.సీస.కంద.
మల్లుచుంటినిగాని
పండితుడనుకాదుపామరుడను!!

ఉ...
నంపద లెన్నియున్న సుఖశాంతులులేని గృహంబుశూన్యమౌ
కంపరమొందుజీవితము కష్టముగా నిటు తోచునయ్య భూ
కంపము వచ్చినట్టులను. కల్లతనంబున కొట్టుకొందురో
రంపము కోత కన్న ఇది రంధినిగూర్చును వేంకటేశ్వరా!!

మద్విరచిత వేంకటేశ్వర శతకం


పదునెనిమిది వందల, ఏ
బదినాలుగు వత్సరమున పావనషిరిడీ
పృదివి పయిన్ గనిపించిన
అధి నాయకవందనములు అర్పింతునయా !!

మద్విరచిత సాయి బాబా చరిత్ర
పద్యకావ్యము
బి.అంజయ్యగౌడ్
యస్ కె నంబరు 501


కం;
గుఱ్ఱము గానక దుఃఖము
వఱ్ఱున బడినట్టి చాందు పాటిల్.కచటా
గుఱ్ఱము జాడను దెలిపియు
చిఱ్ఱును దొలగించినాడు షిరిడీ సాయీ! !

మద్విరచిత సాయిబాబా చరిత్ర

గతంలో దూరదర్శన్ సప్త గిరివారు ఇచ్చిన సమస్య.
సమస్య :-
పాముల జూచిభీతిలి అపంపతి.
కన్నులు మూసెనక్కటా!
పూరణ:-
పామరు లైనకౌరవులు పాండవ పత్నిని రచ్చకీడ్చి సం
గ్రామము నందుగెల్చినటు రంకెలు గొట్టుచు వల్వ లొల్వ,సూ
త్రాముని నైననోర్చి రణరంగమునందున గెల్చుపాండవుల్
మోములు నేలవాల్చిరటు మూర్ఖులు హేలన జేయుచుండగా!!
అంజయ్య గౌడ్

సమస్య :-సారాసేవింమయ్య స్వర్గముదొరకున్
పూరణ :-
కారుణ్యము విడనాడియు.
ఏరోజున కన్నవార్ని.నేడ్పించకనూ
దారుణి తలిదండ్రుల,మన
సారాసేవింపుమయ్య స్వర్గము దొరకున్
బి.అంజయ్య గౌడ్
(నీలకంఠ గారు మీఅభి ప్రాయం చెప్పండి )

మారుతికోపము మాన్పగ
వారిజ నేత్రుండు కృష్ణు.ద్వారకలోనన్
శ్రీ రాముని గామారగ
రారమ్మనిసత్యభామ రాముని బిలిచెన్
అంజయ్య గౌడ్
సమస్య :-6వది.
దనుజులచెండాడె నెవడు
మునివరుడగు నారదుండు మురహరి భజనల్
వనజాక్షీ.ఉత్తరకై
హనుమంతుడు. పాటపాడ.అర్జునుడాడెన్
ఈ.పూరణము.క్రమలంకారపద్దదతిలో
పొరపాట్లుంటె.సవరించండి
అంజయ్య గౌడ్

భూనాధుడు వసుదేవుడు
ప్రాణభయముచేత ఖరముపాదము లంటన్!
నేనేమనివచి యింతును
భానుండుదయించె నయ్యొ పడమర దిక్కున్
అంజయ్యగౌడ్
సమస్య నంబరు 5

కం...గుడి పల్లి వారి కవితలు
నడయాడెడి ఎంకిలాగ నానావిదముల్
గుడియో బడియో ఒడియో
విడియమువలె జెప్పుచుండె వేడుకలలరన్
అంజయ్య గౌడ్

అన్ని దానములలొ అన్నదానమెగొప్ప
యనెడిమాట బాబ.యనుసరించి
పేదవారలకును పిడికెడు అన్నము
దానమిడగ వంట తానెజేసె !!

మద్విరచిత సాయి బాబా చరిత్ర
అంజయ్య గౌడ్

తిరునాళ్ళలొనాటకమున
తరుణీమణి కృష్ణ పాత్ర తాపోషించన్
వరసత్యగనటి యించెడి
పురుషుని మెడలోన భామపుస్తెను గట్టెన్
అంజయ్యగౌడ్

ధారుణి పరిపాలించిన
రారాజులు పూర్వమందు,రాతిరివేలన్
చోరుల బంధించదలచి
చీరనుగట్టినెల. .రాజు చిందులు వేసెన్
అంజయ్య గౌడ్

నీలకంఠ గారు  (నాల్గవ పాదములో)భేసి గుణం జగణం అయ్యింది
 భూమిజ.ప్రాణేశుడెవరు
భామహిడింబా నెవరికి భార్యగమారెన్
సోముడుకాముని.కింపగు.
రాముడు .భీమునుకి.మామ రమ్యముగాదా?
అంజయ్యగౌడ్

 
 ఆంగ్ల భాష రాని.అంజయ్యమాటలు
వినుట ఏలననుచు విబుధులార
మనమునదలపోసి మరసిపోకుడనుచు
మ్రొక్కుచుంటిమీకు చక్కగా ను

అంజయ్యగౌడ్. .ఆ.వె

హైకులోని కవుల.అడ్రసు లన్నియు
తెలుగు లోనెవెలగ వలయు.గాన
మార్చుడయ్య. త్వరగ,మహనీయులందరు
అంజగౌనిమాట నాలకించి!!
అంజయ్యగౌడ్

కం..
ఏకాదశి రోజున.సు
శ్లోకుండగు విష్ణుమూర్తి. స్తోత్రం జేయన్
ఏకాలమనకశౌరియు
చీకాకులు తొలగజేసి శీఘ్రమె గాచున్
అంజయ్య గౌడ్

పరిణయమయ్యిన తదుపరి
విరిబంతితొ నాటలాడు.వేలలొవరునిన్
తరుణీమణి విసరిన ఆ
విరితాకిడి కోర్వలేని వీరుండితడే
అంజయ్య గౌడ్

అంశము:-కలం*బలం
కం.కలమును మించిన దేదియు
ఇలపైనను లేదుసుమ్మి ఏ దిశ నైనన్
కలమేబలమైవరమై
కలకాలమునిలుచునిజము కరుణాస్పదయై !!

కం..హరిచేతి సుదర్శన మును
సురగంగావరుడుబట్టెశూలాయుధమున్
వరరామబాణమైనను
కరమొప్పగ.రావు రావు.కలముకుసరియై!!

పాటలుపద్యములైనను
నాటకములుమధురమైననానాకవితల్
ధీటైనవిలేకరులును
ఘాటగువార్తలనువ్రాయ.కలమేబలమౌ!!

కారణజన్ములు.వ్రాసిన
భారతరామాయణాదిభాగవతమ్ముల్
నోరారగచదువుట,సం
స్కారమ్మగుకలముబలముగాదేభువిఫై!!

నన్నయతిక్కనపోతన
సన్నుతులౌకాళిదాస,సంస్కృతకవులున్
ఉన్నతమౌకీర్తివడయు
టెన్నగఘంటముమహిమయె,ఈజగమందున్
అంజయ్యగౌడ్
 
✳శ్రీరేణుకాదేవిదండకం✳
శ్రీరేణుకాదేవి.త్రైలోక్యలావణ్య.సమ్మోహనాశక్తి,
నీ.పాదపధ్మంబులన్,ధ్యానమున్.జేసి,
నీ పైననేదండకంబొక్కటిన్,వ్రాయుచున్నాడనోయమ్మ,
నాపైన నీదివ్య కారుణ్యముంజూపి, కాపాడిరక్షించుమోతల్లి, నీలీలలన్. దెల్యగాశక్యమానేరికిన్. దేవి నీనామసంకీర్తనల్, జేసితేచాలుగా సర్వపాపంబులున్, సర్వదోషంబులున్. దూరమైబోవునోతల్లి, దేవీమహాకల్పవల్లీ,జగన్మాతవై
నిత్యసంతోషివై సత్యసంభాషివై, ధర్మసంరక్షణాభారమున్. మోయగామున్నురాజేంద్రుడా. రేణుడన్వానికిన్.
బుట్టిమౌనీశుచేపట్టి. సంసారసౌఖ్యంబులన్బొంది. దేవాదిదేవుండునౌమాధవున్. పుత్రుగాబొంది, దుర్మార్గులౌ
క్షత్రియారాజ. రాజాత్ములన్జంపగాజేసి. ధర్మంబురక్షించి. భూమాతకున్
క్షేమమున్. గూర్పిబ్రహ్మాండభాండంబులన్, నిండియున్నట్టి. నీదివ్యరూపంబునీదివ్యతేజంబు. వర్ణించగాశక్యమాతల్లి, నీమాయజాలంబు. గుర్తెర్గనెవ్వారికిన్. సాధ్యమా. బ్రహ్మరుద్రాదులున్, పంచభూతంబులున్. చుక్కలున్.దిక్కులున్.సూర్యచంద్రాదులున్.యోగులున్.భోగులున్,సర్వసంసారచక్రంబునీమాయనేగాదతల్లీజగద్.కల్పవల్లీధరన్.గల్గు,అష్టాదశాపీఠమందుండు నీదివ్యరూపంబు. దర్శించునవ్వారికిన్. పుణ్యమున్, గల్గునోయమ్మ, ఓపెద్దగౌరమ్మ, మమ్మేలరావమ్మ.
లంకాపురీ శాంకరీదేవినీవమ్మ
కాంచీపురంబందు కామాక్షినీవమ్మ
ప్రద్యుమ్నదేశంబునన్శృంఖలాదేవివై,
క్రౌంచపౌరీశ్వరీ కాశివిశ్వేశ్వరీ.
జోగులాంబ అలంపౌరిసంరక్షిణీ. శ్రీగిరివాసివై భ్రామరీశక్తివై. చల్లనీతల్లి. కొల్లాపురంబందునన్.శ్రీమహాలక్ష్మివై
చింతలన్.బాపియున్. క్షేమ మున్ గూర్పియున్.
మాహూర్యమందున్న ఓ ఏకవీరమ్మనీ
కన్నమాకింకవేరేమిలేదమ్మ.
ఉజ్జైనిమాంకాళి. నీఉగ్రరూపంబు.
వీక్షించగామాకు. ధైర్యంబులేదమ్మ.
శాంతస్వరూపంబునన్. దర్శనంబిమ్ము, పీఠాపురంబందు.పూర్ణేందుతేజస్వినీ.
లోకసంరక్షణీ.పాపసంహారిణీ.
పార్వతీశార్వరీ,పాహిమాంశాంకరీ.
దేవిసర్వేశ్వరీమమ్ముకాపాడుమోతల్లి.
నీపాదదాసానుదాసుండు అంజయ్యగౌనిన్, సదారక్షజేయంగ నీవేకదా.
రేణుకాదేవి.తల్లీనమస్తే
సమస్తే నమస్తే, నమస్తే. నమః....

ఈదండకంచదివిసహస్రకవులందరుమీమీఅభిప్రాయములు.ఆశీర్వాదాలు.అందజేయగలరు
అంజయ్యగౌడ్

భార్యభర్తలంత.బండిపైపయనించు
వేలటైరులోనిగాలిపోవ
బాటసారివెంట.పంపెనుసతి,నను
మానమేమిలేని.మంచి మనిషి
అంజయ్యగౌడ్


అయుతకవితాయజ్ఞం
అంశం:-నేటి సమాజం.యస్ కె నెం501అంజయ్యగౌడ్
నేటి సమాజం నేటి సమాజం
నేతిబీరకాయగ మారెఇదినిజం
నేతిబీరకాయలొ నెయ్యి కరువు
నేటి సమాజంలొ నీతికరువు
దౌర్జన్యం దుర్మార్గం దర్జాగా వెలుగుతుంటె
సత్యం ధర్మం న్యాయం చావలేక బ్రతుక వట్టె
అన్యాయలక్రమాలు అధికారిక తప్పిదాలు
సమాజంనడ్డివిరిచి శవమువలెను మార్చివేసె!!నే!!

టెన్షన్ టెన్షన్ టెన్షన్ కూడు లేని వానికి కొంతే టెన్షన్
కోట్లున్నవానికి మరెంతో టెన్షన్
చదువుకుంటె వచ్చేది ఉద్యోగం ఒకనాడు
చదువు కొంటేగాని రాదు ఉద్యోగం ఈనాడు!!నే!!

మతం పేరుతోమారణహోమాలు
కులంపేరుతో కుమ్ములాటలు
ప్రేమపేరుతొ యువత పెడదారిపడుతుంటే
బిక్కు బిక్కు మని పెద్దలు వెక్కివెక్కి ఏడ్చుచుండ్రి!!నే!!

విద్యాలయాల్లో విద్యార్తుల వికృత చేష్టలు ఎన్నోఎన్నెన్నో
బాలికలపై యాసిడు దాడులు
బలవంతపు లైంగిక వేధింపులు
అనరాదు వినరాదు కానరాదు
అన్యాయం అన్యాయం
మరల సమాజమార్పు కోసం మహాత్ముడె పుడతాడో లేదా
మాధవుడే పుడతాడో చూడాలి వేచి
చూడాలి!!నే!!
పుత్ర జన్మ వలన పున్నామ నరకము
తొలగుననుచు బుధులు పలికి నారు
దక్కె ఫలము నీకు తండ్రివై నందుకు
సల్ల విజయ నీకు సత్వరమున
తండ్రిగా ప్రమోట్ అయినందుకు
శుభాభినందనలు
అంజయ్యగౌడ్
 అల్లము టీ త్రాగినచో
ఉల్లములో కల్గుననుచు ఉత్సాహమిలన్
అల్లిన మీ పద్యము ,ప్రణ
మిల్లగ జేసెను  తమకిదె మేనొంచి ధరన్
అంజయ్యగౌడ్
 
అయుతకవితయజ్ఞం
అంజయ్యగౌడ్ యస్ కె నంబర్
501
మధ్యాక్కర
దక్షిణ సమకూడ గానె తరుచుగా పేద వారికిని
సాక్షాత్తుగా తానె వంట సరకులు
 గొని తెచ్చియూను
లక్షణముగ వండి బాబ రయముగ అందరి కచట
కుక్షి నిండగను భోజనము కొసరి వడ్డించు నిరతము  

భుజంగ ప్రయాతం
మహల్సాపతీ బాబ మర్మంబెరంగీ
మహదేవుడంచున్,క్రమంబు ప్రవృత్తిన్
అహంవీడి నిత్యం జయంబొంద పూజల్
సహాస్రాంస తేజుండు సాయీశు గొల్చున్

తోవక వృత్తము

మందిర మందున మాపటి వేలన్
పొందుగ వారికి ముందుగ ఎన్నో
సుందర మైనవి సూక్తులు నిత్యం
సందియ మీడగ సద్గురు జెప్పున్
(మద్విరచిత సాయి బాబా చరి
త్ర)అంజయ్యగౌడ్
 అయుతకవితయజ్ఞం
అంశం :-కల్తీ
కం  :-ఇందుగలదందులేదని
సందేహం వలదు కల్తి సర్వము తానై
ఎందెందు వెదికి జూచిన
అందందె గలదు మానవాళికి చెడుపై

పదహారవ వత్సరముకు
విదితమ్ముగ స్వాగతమని విచ్చలవిడిగన్
మదిరను సేవించి యువత
పదనిసలచె నాట్యమాడ పరువేముండున్ !!
అంజయ్యగౌడ్
అయుత కవితా యజ్ఞం యస్.కె.నంబర్ 501అంజయ్యగౌడ్
అంశం  :-మంచి మిత్రుడు
సీసపద్యము
మణులు మాణ్యములేల !మంచి మిత్రుడు చాలు
నిఖిల మందున కీర్తి నెగడ వచ్చు
దగదగ మెరిసేటి నగలు నాణ్యము వేల
సద్గుణు డైనట్టి !సఖుడు చాలు
.సామ్రాజ్య రాజన్య సార్వభౌమత్వము
సరిరావు రావండి సఖుని కెంత
వెలకట్ట లేనట్టి చెలికాడు ఒకడున్న
చాలు ఈ ధరణిలో సకలమబ్బు!!
తే.గీ.
కనుక నామాట విని మీరు !క్ష్మాతలమున
సుగుణ వంతుడౌ మనుజుని జూచుకొనియు
చెలిమి జేయుడు నరులార శీఘ్రముగను
కీడు యొనగూడ దేనాడు కీర్తి గలుగు!!1
ఉత్పలమాల
ఆలిని చూరబుచ్చి తనకాపద  గూర్చిన వాలిబారికిన్
తాలగ లేక సూర్యసుతు దాశరథిన్ శరణొందినంత,న
వ్వాలినిసంహరించియును ,వానరరాజుగ జేసినట్టి,సౌ
శీలుడు రామచంద్రుసరి జేరుసఖుండు గలండెధాత్రిలో!!
తే.గీ.
కూడు గుడ్డలు లేకను కుమిలి కుమిలి
ఆలుపిల్లల బాధ తానరయ లేక
బాల్య స్నేహితున్ గాంచగ బైలుదేరి
ద్వారకన్ జేరబోయె సుధాము డంత
కందము
ఏతెంచెను స్నేహితుడని
పూతనజితుడెదురునేగి పూజించియునూ
ప్రీతితొ భాషణ లాడుచు
ధాతకులుని ఉద్ధరించె తక్షణమందున్!!4
ఉత్పలమాల
కూటికి లేకయున్నతనకోసము దెచ్చిన అట్కులన్ గొనీ
నోటను బోసుకొంచుహరి నొప్పగు సంపదలెన్నొయిచ్చెగా
ఏటికి నీచమిత్రులును ఎందరు యుండిన ఏమిలాభమో
మేటిసఖుండు ,కృష్ణువలె మేధిని యొక్కడె నుండ చాలదే!!

 నూతనసంవత్సరశుభాకాంక్షలు
కందం
నూతనసంవత్సరమున
ఖ్యాతిన్ నెలకొల్పరయ్య కవన వనములో
కైతలు పూయించి కవులు
చేతోమోదంబుతోడ చేయుడి యత్నం!!

కవితా యజ్ఞం జేసియు
అవిరళముగ పద్యగేయ మల్లుడి మీ మీ
ప్రవిమలమగు వాగ్దాటిచె
సువశీకరమైనకీర్తి శోభిత మవగన్



 
ఒక్కడు వీరభద్రుడట ఉగ్రముగా రణరంగమందునన్
పెక్కురు దానవాధముల పించమడంచిన శంభుసూనుడున్
వ్రక్కలు జేసె దక్షశిర వైరిభయంకర రుద్రమూర్తికిన్
మ్రొక్కుడి చిన్నపెద్దలును భోగము యోగమొసంగు స్వామికిన్
ఇందిరక్క కవితకు అనువాదం
అంజయ్యగౌడ్


అయుతకవితాయజ్ఞం
అంజయ్యగౌడ్ యస్ కె నంబర్501
✳మంగళ హారతి✳
ఈశా! మంగళ హారతి! దేవాదిదేవ!   సర్వేశ! మంగళహారతి!!ఈ!!
ఈశా! జగధీశ!మునిపోషా !భవనాశపార్వతి!!ఈ!! 1
లింగా!మంగళహారతి! త్రైలోక్యవినుత! శు!భాంగామంగళహారతి!!లింగా!!
లింగా!మదభంగా!భస్మాంగా!వేదాంగసన్నుత!!ఈ!!2
ఫాలాక్ష! విధుశోభితా!!పరమాత్మశంకరా!!ఫా!!
శీలా!గిరిలోలా!మృగచేలా !మమ్మేలరావ !సర్వేశా!!3
హాటకాంబర శంకరా! అంబా మనోహరా!!హా!!
మేటి! నీసాటి!హరికోటి !కొనగోట మీటిన!!ఈ!!4

నందివాహన!శంకరా! నారాయణవినుత!!నంది!!
నంది !జయమొంది !మమ్మంది
మారందిబాపుమా!!ఈ5
కైలాస నిలయేశ్వరా!గంగాధరహరా !!కై!!
ఏలా!చలమేల! మమ్మేల!రావేలశంకరా!!ఈ!!6
రక్షింపు మనివేడితి! రాజేశ్వర నిన్నిదే!!ర!
రక్షా!యమశిక్షా! సురక్షా!దక్షా ధ్వర ధ్వంసక!!ఈ!!7!!
కారుణ్యమూర్తీశివా!!గజచర్మ ధారణా!!
స్తిరము!శుభకరము !అనుదినము!
అంజయ్యను బ్రోచె!!ఈశా!!8


🔯ఆ.వె🔯
ధనపతి సఖుడైన దాక్షాయణి వరుడు
తిరిపెమెత్తెను గద తిరిగి తిరిగి
పరుల కెంత యున్న ఫలమేమి మాయమ్మ
రేణుకాంబ తల్లి రేణుకాంబ!!
అంజయ్యగౌడ్
ఆ.వె
కోడి పుంజు లేల ఓడి బియ్యముచాలు
మేక పోతులబలి మెచ్చకమ్మ
మాంస భక్షణకయి మాయొక్క లీలలు
రేణుకాంబ తల్లి రేణుకాంబ !!
అంజయ్యగౌడ్
ఆ.వె.  శివ శివ ,మదహరణ శీతార్క శోభిత
భవహర శితికంఠ వామదేవ
వెండి కొండ నిలయ  విశ్వేశ ముక్కంటి
మ్రొక్కితి నను బ్రోవు మోక్షధాత !!

అంజయ్యగౌడ్
అయుతకవితాయజ్ఞం
అంజయ్యగౌడ్ యస్ కెనెం501
కవితసంఖ్య41శీర్షిక అమ్మ సీసపద్యము
అమ్మ కోసమె కదా! ఆదినారాయణుం
డవతరించెను మున్ను !అవని పైన

అమ్మ కోసమెగద అలనాడు పక్షీంద్రు
డమృతమ్మును అసుర మాతకొసగె

తనతల్లి మాటకై ఘనుడాంజ నేయుడు
రామచంద్రుతొబోరె సమర మందు

జనని కోరిక దీర్చ మనుజ లోకమునకు
ఐరావతముదెచ్చె అర్జునుండు
తే.గీ
మాత మర్యాదకై గాదె మనసు నిల్పి
తపము జేసెను ధృవుడు శ్రీ ధరుని కొరకు
అంత ప్రఖ్యాతి గాంచిన అమ్మమనసు
బాధ గల్గింప బోకుడి ఈధరిత్రి!!

అయుతకవితాయజ్ఙం యస్కెనెంబర్501
అంజయ్యగౌడ్
మంగళవారం(మారుతిస్తోత్రము)

కవితసంఖ్య 42
మదన వృత్తము

శ్రీ రామదూత సుగుణాశ్రిత భానుమిత్రా!

మారాము చేయకు ,ప్రభోమహితాత్మ దేవా!

కారుణ్యమూర్తి ,జయహే  కరుణాలవాలా!

వీరాంజనేయ, విజయంబివుమో కపీశా!!



కం. ఈశుని తేజము అంజలి
దోసిలి బడవేసె గాలిదొర దయతోడన్
వాసిగ ఫలమని మ్రింగిన
భాసురముగ జననమొంది భజరంగభళీ


కం.ఉంగరమొసగియు జానకి
సింగారపు మణినిదెచ్చి శ్రీరామునకున్
రంగారనిచ్చి సీతా
సంగతులను దెలిపినట్టి స్వామివి హనుమా
అయుతకవితాయజ్ఞం యస్కెనెంబర్
501 అంజయ్యగౌడ్ కవిత సంఖ్య43
శ్రీ అయ్యప్ప ప్రార్థన కందపద్యములు

శ్రీకర కరిమల మందిర

నాకాధిప వినుత లోక నాయక దేవా!

రాకేందు శోభ శుభకర

చేకొనుమిదె వందనంబు శ్రీ అయ్యప్పా!! 1

"హరహర"సంగమ ఫలమై

ధరణిలొ జన్మించినావు ధర్మము నిలుపన్ !

వరధాయక కలిపురుషుని

ధురితమ్ములు ,రూపుమాపు దొరఅయ్యప్పా !!2

నల్లని వస్త్రములను మే

నెల్లను ధరియించి నిన్ను ఎంతో భక్తిన్!

కొల్లలుగా వేడు నరుల

ఉల్లములో నిల్చెదవట  ఓ అయ్యప్పా!!3

కృపజూపుమి ఓ దేవర

చపలుడ శీతల జలమున స్నానం జేయన్!

ఉపవాసముండ నోపను

అపరాధిని నన్నుగావు హరిహర పుత్రా!!4

నీపాదములను నమ్మితి

నాపాపము దొలగజేయు నలిన దళాక్షా!

కాపాడవె కరుణాకర

రాపింతయు జేయబోకు రా! అయ్యప్పా!!5!!


కందము
ఆపద్భాందవుడవనుచు
శ్రీపతియే బిలికెనిన్నుశ్రీకంఠాంశా!
నీపాదభజన మరువను
నాపాపము దొలగజేయు నయమిదె హనుమా!!1



సూర్యాత్మజు గావగ సుర
వర్యాత్మజు సమయజేయు పని నీదయ్యెన్ !
సూర్యాత్మజు జంపగ సుర
వర్యాత్మజు రథముపైన ధ్వజమై హనుమా
భావము
మొదటి పాదములో వాలి సుగ్రీవులు
రెండవచరణములొ కర్ణుడు అర్జునుడు
అంజయ్యగౌడ్

కందము
హరశరమా వెనుదిరగదు
మరణము నీ దరికిరాదు మారుతి రాయా!
ధరపాలుడె బహు ధన్యుడు
వరదుడ శ్రీ రామదూత బలయుతహనుమా!!

(యయాతిచరిత్ర)
అంజయ్యగౌడ్
భళిభళి భారత సైనిక
భళియైతివ భరతమాత పరిరక్షణకై
వెలకట్టని నీత్యాగము
కలకాలము నిలుచు సూర్య కాంతికి
సమమై
అమరులైన భారత సైనికులకు శ్రద్ధాంజలి
అంజయ్యగౌడ్
అయుతకవితాయజ్ఙం
అంజయ్యగౌడ్ యస్ కె నెంబర్ 501 దేవతా స్తోత్రం
సీసపద్యము
పాలవారధిపైన ! పవ్వలించినవాని
సతిసోదరునిముద్దు! సఖియ తండ్రి
ముద్దుసుత ,ప్రాణేశు! పూజించు నవ్వాని!
పుత్రుని సతితండ్రి! బువ్వయైన
వానివరముచేత !జనన మొందినవాని!
చేతిలో జచ్చిన!భూతలేశు
మేనకోడలుభర్త !మేనమామనుగన్న
వాని సోదరి ! తనయు తండ్రి!!
తే.గీ.
వరమునను బుట్టి,నవ్వాని!వనిత బావ!
ప్రాణముల్ దీసె పదునైన!బాణమేసి
అట్టి,ప్రభుకీర్తనల్ బాడు!అమిత బలుని!
పగలు రేయనకుండ !బ్రస్తుతింతు!!
         * భావము*
పాలవారధిపైన శయనుడు శ్రీమహావిష్ణువు విష్ణువు భార్య లక్ష్మి
లక్ష్మిసోదరుడు చంద్రుడు చంద్రుని
ప్రియమైనభార్య రోహిణి రోహిణీతండ్రి
దక్షుడు దక్షునిబిడ్డ సతీదేవి సతీదేవి భర్త శంకరుడు శంకరుని పూజించినవాడు రావణుడు రావణుని కొడుకు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుభార్య సులోచన తండ్రి నాగరాజు నాగరాజు ఆహారం వాయువు (గాలి) వాయువరమున బుట్టిన వాడు భీముడు భీమునిచే చచ్చినవాడు కీచకుడు కీచకుని మేనకోడలు ఉత్తర  ఉత్తర భర్త అభిమన్యుడు అభిమన్యుని మామ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు వసుదేవుని సోదరి కుంతి కుంతిపెద్ద కొడుకు కర్ణుడు కర్ణుని తండ్రి సూర్యుడు సూర్యుని కుమారుడు సుగ్రీవుడు సుగ్రీవుని భార్య రుమ రుమ బావ వాలి వాలిని
చంపినవాడు శ్రీరాముడు శ్రీరాముని కీర్తించెడి వాడు శ్రీ ఆంజనేయుడు అట్టి ఆంజనేయ స్వామిని ఎల్లప్పుడు
ప్రస్తుతి చేస్తాను అని భావము



 అయుతకవితాయజ్ఙం అంజయ్యగౌడ్ యస్కెనెంబర్501
కవితసంఖ్య46 సీసపద్యము

కైలాస వాసుని !కంటిమంటయు సోకి
    కూలిపోయినవాని!కొడుకు పత్ని
ముత్తాత తండ్రిని ముదముతో గన్నట్టి!
   వానితండ్రికి తండ్రి యైనవాని
పదమున బుట్టిన పడతి కుమారుని                   ధరణిపై గూల్చిన ధైర్యవంతు!
ముద్దుల తనయుని పెద్దనాన్న జనకు!
    డైనవాని సఖుని !అతివయందు
 అవతరించిన యట్టి  అమిత బలాడ్యుని
        ఆలించి లాలించి నట్టిమాత!
    ఆమెసోదరునికి నాశ్రయ మిచ్చిన
       బలవంతు దాటిన బాహుబలుని
అట్టివాని వలన అంతమొందినవాని
    తండ్రిని బరిమార్చు ధరణి పతికి
విద్యలు నేర్పియు విలుకాని జేసిన
     వానితపస్సును భంగపరచి
నట్టి కాంతకు బుట్టిన అతివ యొక్క
పుత్రుడేలిన భూమిలో బుట్టినట్టి
సకల జనులకు శిరమొంచి ప్రకటితముగ
వందనము జేయు చుంటిని వాసిగాను!!

భావము:- కైలాసవాసుడు శంకరుడు శంకరుని కంటిమంటచే కూలిపోయినవాడు మన్మధుడు(ప్రద్యుమ్నుడు)మన్మధుని కుమారుడు అనిరుద్దుడు అతనిభార్య ఉష !ఉష ముత్తాత ప్రహ్లాదుడు ,తండ్రి హిరణ్యకశిపుడు అతని తండ్రి కశ్యపబ్రహ్మ!కశ్యపుని తండ్రి బ్రహ్మ బ్రహ్మతండ్రి విష్ణువు విష్ణుమూర్తి పాదమున జన్మించింది గంగ,గంగకుమారుడు భీష్ముడు భీష్ముని పడగొట్టినవాడు అర్జునుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడి పెద్దనాన్న భీముడు భీముడితండ్రి వాయుదేవుడు వాయువు మిత్రుడు
అగ్నిదేవుడు అగ్ని భార్య స్వాహాదేవి
ఆమెద్వారా జన్మించినవాడు కుమారస్వామి కుమారస్వామి తల్లిపార్వతి పార్వతి సోదరుడు మైనాకుడు అతనికాశ్రయమిచ్చినవాడు సముద్రుడు సముద్రుని దాటినవాడు హనుమంతుడు హనుమంతుని చేతిలో చచ్చినవాడు అక్షయుడు అక్షయుని తండ్రి రావణుడు రావణుని చంపినవాడు శ్రీ రాముడు
రామునికి విద్యలు నేర్పినవాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని తపస్సు భంగం పరచినది మేనక
మేనక కుమార్తె శకుంతల శకుంతల కుమారుడు భరతుడు భరతుడు పాలించిన భూమి భారతదేశం ఈ దేశంలో జన్మించిన వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను
   శుభం







మాడుగుల మురళీధరశర్మగారికి
ఆత్మీయ కవితాంజలి
ఉత్పలమాల
ధన్యుడ నైతినయ్య,తమధార్మిక స్నేహము లభ్యమయ్యె ,సౌ
జన్యుడవైననీకు సుఖశాంతులొసంగును,ఈశ్వరుండు,ప్రా
వీణ్యము లేనినన్ను,బహు, ప్రేమతొ బ్రస్తుతి జేసినావు ,ఓ
మాన్యుడ వందనంబిదిగొ మామురళీధరశర్మ భూసురా!!
అంజయ్యగౌడ్ యస్ కె నెంబర్501
కవిత సంఖ్య 46

కందము
శ్రీకరుడౌ సూర్యుడెపుడు
ప్రాకటముగ వెలుగు నొసగ భాసిలె ధరణీ
మేకరవీంద్రుండటులనె
ఏకంబుగజేసి కవుల, కిచ్చెన్ శోభన్!!
మిత్రుడు మేక రవీంద్రగారికి
కవితాంజలి
అంజయ్యగౌడ్ 10_1_2016








కందము
ఇందుని వారము నందున
ఇందుధరుని స్మరణ వలన యెల్లజనంబుల్
పొందెదరిక శుభఫలములు
అందరు భజియించుడయ్య హరహర యనుచున్

హాలాహలమును ,గ్రోలిన
శూలాయుధుడైన శివుని స్తోత్రం జేయన్
ఆలించియు మనల నెపుడు
పాలించును నిజము నిజము బ్రహ్మాండపతీ!!

మురహరి,బ్రహ్మాధులెపుడు
స్మరియింతురు సాంబశివుని చరణాబ్జంబుల్
దురితములను బోనాడగ
గిరిజాపతి నామమెపుడు కీర్తించుడయా!!
అంజయ్యగౌడ్ యస్కె నెంబర్501
కవితసంఖ్య48



అయుతకవితాయజ్ఞం
అంజయ్యగౌడ్ యస్కె నంబర్501
✳శీర్షిక గాలిపటాలు✳ కవితసంఖ్య49
ఉత్పలమాల
గాలిపటాల చిత్రములు  గాంచగ నబ్బుర మొందనాయె ,భూ
పాలకు లెందరెందరినొ,వన్నెలుమీర పటంబులందు,స
మ్మేలము,జేయుశిల్పులను ఏవిది సన్నుతి జేయవచ్చు,ఈ
లీలతొ, వర్తకమ్ము నవలీలగ సాగెను జోరుజోరుగా!!
కందము
మంత్రులు,సామంతులు ,శ్రీ
మంతులు సినిమా జనాల మాన్యుల బొమ్మల్
వింతగ గనుపించి గగన
మంతయు శోభిల్లె నయ్య గాలిపటంబుల్

అయుతకవితాయజ్ఙం
అంజయ్యగౌడ్ యస్కెనెంబర్501

కవితసంఖ్య 50 శీర్షిక( నర్తనశాల
)
కీచకుడు --సైరంద్రి-(ద్రౌపది) సంవాదం

*సీసమాలిక*

కీచక:- మధురాక్షి నాతోడ మరుకేళి దేలగా!
      వెరపు జెందెదవేల  వెలది నీవు

సైర:- పతి,వ్రతా మణులకు పరవారి తోడను
     రతికేళి దేలుట  రంకు గాదె

కీచక:- దాసి దానవు నీవు  ధర్మంబు జెప్పక
    చెంత జేరగరమ్ము  దంతియాన
సైరంద్రి:-  దాసివారందరు ధర్మంబు దప్పుట
     పాడిగాదికవిను  పార్థివేంద్ర

కీచక:- తరుణిపై భ్రాంతిచే  సురనాధు డానాడు
     గౌతము పత్నిని  గలయలేదె

సైరంద్రి:- మునిపత్ని బొందియు  తనువెల్ల యోనులై
   సురపతి సిగ్గుచే మరుగు పడెను

కీచక:- సురగురు పత్నితో మరుకేళి దేలియు
   వరలె శశాంకుడు  వాసిగాను

సైరంద్రి:-  తారను గూడిన నేరానికే రాజు(రాజు=చంద్రుడు)
    కళలు నశించి తా కాంతితగ్గె

కీచక;- తరుణి సీతమ్మను  దశకంఠు డానాడు
   అనుభవించగనెంచి నపహరించె

సైరంద్రి:- వైదేహి గొంపోయి వైరముగొని, తెచ్చు
 కుని,రావణుడు గూలె అనిలొ మున్ను

కీచక:-మాయవేషముదాల్చి మాధవుండలనాడు
   బృందతో మరుకేళి పొందినాడు

సైరంద్రి:-  పరమాత్ముడైనను పతివ్రతన్ జెరచియు
   శిలయౌచు పడియుండె చలములేక !!
తే.గీ
కీచక:-మేటి బలశాలులెవరు నా సాటిరారు

సైరంద్రి:-ఎంత ధీరుండవైతె నాకేమి పొమ్మి

కీచక:-కాంత ననుగూడ కున్ననీ యంతు జూతు
సైరంద్రి:-చావుమూడియు నీబుద్ది చపలమయ్యె!!

కీచక:- దండధరుడైన ననుజూడ గుండె లదురు

సైరంద్రి:-భండనోద్దండ బలులైన పతులు గలరు

కీచక:- నీదు పతులను బరిమార్చి నిన్నుగొందు

సైరంద్రి:- తప్పదిక నీదు మృత్యువు తద్యమిలను!!


సహస్ర కవులందరు చదువగలరని ఆశిస్తున్నాను   అటుపిమ్మట మీ ఇష్టము  నా అదృష్టము
 
అయుతకవితాయజ్ఞం  యస్ కె నెంబర్501అంజయ్యగౌడ్
కవితాశీర్షిక సంక్రాంతి కవిత నెంబర్47
ఉత్పలమాల
పచ్చనితోరణంబులచె! వాకిలు లన్నియు శోభనివ్వగన్!
మచ్చిక బంతిపూలు,సురమల్లెలు ,మంకెన తెల్లతామరల్!
దెచ్చియు,హారమల్లియును దివ్యముగాను యలంకరించియున్
వెచ్చని భోగిమంటలును ,వీదుల నన్నిట వెల్గుచుండగా!
వచ్చెను సంకురాత్రి,ఘనవైభవ లచ్చిని  వెంటదోడుకన్!!
(పంచపాది)
అన్నా!మధుసూధన ,మీ
కున్నా! పాండిత్యమునకు ,వొంచితి శిరమున్ !
మన్నించవె నీ ముందర
చిన్నోడను నాదుకవిత  చేకొను మన్నా!!
అంజయ్యగౌడ్
ఏమి?విచిత్రమయ్యొ!మునుపెన్నడు  , ఇంతటి ఘోరదృశ్య,మీ
భూమిని ,చూడలేదు మునుముందుగ,బుక్కెడు బువ్వబెట్టు,ఆ
సామికి దిక్కులేకయిల సార్లకు వంగియు మ్రొక్కవట్టె,ఇం
కేమియు రైతురాజ్యమయ,యెందుకు గొప్పలు జెప్పుకొందురో !!

కళాచందర్ గారు పంపించిన కర్షక దేవుడు అధికార్ల కాల్లు పట్టుకున్న చిత్రం చూసి వ్రాసిన పద్యం
అంజయ్యగౌడ్


కందము
అన్నా!మేకరవీంద్రా!
నిన్నేమని బొగడగలము నీయోచనకున్!!
యెన్నగ దండం బిడుటే
చిన్నలు పెద్దలము రెండు చేతుల తోడన్
అంజయ్యగౌడ్

నాపూరణలు 1
బావజు వైరితేజమున పావనిగా జనియించినట్టి ,సు
గ్రీవుని మంత్రివర్యుడగు కేసరి నందను నాంజనేయుడున్
రావణు యాఙ్ఞచేత రఘురాముని నెత్తుక పోయినట్టి, మై
రావణు సంహరించి రఘురాముని గాచెను దీర్ఘదేహుడై
2
దురితులు శుంభ నిశుంభులు
వరగర్వము చేతసురల బాధింపంగా
సురలను గాపాడగ ,శాం
కరి, సింగము పైనినెక్కి ఖలులన్ గూల్చెన్!!
అంజయ్యగౌడ్

కందము వ్రాసిన కవియను
సుందర వాక్యముకు మిమ్ము జూపింప దగున్!
వందనమిదిగో! విజయా
నందన ,నీపద్య కవిత నన్నలరించెన్!!

(విజయకుమార్=విజయనందన)
విజయకుమార్ పద్యములను ప్రశంసిస్తూ
అంజయ్యగౌడ్
సహస్రకవులకు సంక్రాంతి శుభాకాంక్షలు
అయుత కవితా యజ్ఞం యస్కె నెంబర్ 501 అంజయ్యగౌడ్
*సీసపద్యము*
పదినూర్ల కవులకు ! పాదాభివందనం
బాచరించుచునుండె! అంజగౌడు
పద్యాలు  పాటలు! వచన కవిత్వముల్
   గేయాలు ఖండికల్ !తీయగాను
సర్వ యుద్ధండులు !గీర్వాణ భాషలో
    పూరణల్ యితిహాస ! సారములను
జాతీయ నేతల !చారిత్రములనెల్ల
   కనుల ముందుంచిరి !కవితలల్లి
తే.గీ
అట్టి మహనీయు లందరి! నభినుతించి
భోగి సంక్రాంతి కనుము,శుభోదయముల
క్రాంతి,చేతను మీ యొక్క కవిత వెల్ల
పరిడ,విల్లగ దలతు నా ప్రణతులివిగొ!!

*కందము*
వచ్చెడి యుగాది వరకు ను
కచ్చితముగ రెండువేల కవిపుంగవులున్
ముచ్చట గొలిపే కవితలు
అచ్చతెనుగులోన ,వ్రాయ ,ఆనంద మగున్!!

వేయి మంది కవుల కిలను వేదికయ్యె  వాట్సపున్!
హాయిగాను కవితలెన్నొ అల్లుచుండ్రి యింపుగా!
శ్రేయుడౌ రవీంద్రగారు జేసినట్టి యోచనా!
గేయ పద్య వచన కవిత క్షీరధార లౌచునూ!!
అంజయ్యగౌడ్
కవత సంఖ్య 53


అయుతకవితాయజ్ఞం
అంజయ్యగౌడ్ యస్కె నంబర్501
✳శీర్షిక గాలిపటాలు✳ కవితసంఖ్య49
ఉత్పలమాల
గాలిపటాల చిత్రములు  గాంచగ నబ్బుర మొందనాయె ,భూ
పాలకు లెందరెందరినొ,వన్నెలుమీర పటంబులందు,స
మ్మేలము,జేయుశిల్పులను ఏవిది సన్నుతి జేయవచ్చు,ఈ
లీలతొ, వర్తకమ్ము నవలీలగ సాగెను జోరుజోరుగా!!
కందము
మంత్రులు,సామంతులు ,శ్రీ
మంతులు సినిమా జనాల మాన్యుల బొమ్మల్
వింతగ గనుపించి గగన
మంతయు శోభిల్లె నయ్య గాలిపటంబుల్

అయుతకవితాయజ్ఞం యస్కె నెంబర్501 అంజయ్యగౌడ్
(భరతమాత)  మేఘవిస్ఫూర్జిత వృత్తము
పవిత్రంబయ్యెన్ !నాదుతనువిక ఈ భారతంబందు !బుట్టన్
వివేకానందుండాది,ప్రముఖులు గాంభీర్య బ్రహ్మన్నలున్,సం
భ ,వించారిచ్చోటన్ భుజబలులు విబ్రాజ్యులౌ వీరులున్ ,స
త్కవీంద్రుల్ నానాశాస్త్రములు యితివృత్తంబులున్ నుద్భవించెన్

అన్నా!మధుసూదనా నిన్ను చూచి
నేను ప్రయత్నించాను కావున ఆమూలగ్రముగా పరిశీలించి పొరపాటు జరిగితే సవరంచి మీ అమూల్యమైన అభిప్రాయంతెలియజేయ గారు
తమ్ముడు అంజయ్యగౌడ్

అయుతకవితాయజ్ఙం అంజయ్యగౌడ్ యస్కె నెంబర్501
కవితసంఖ్య56
శీర్షిక   *తల్లిదండ్రులు*
   
        సీసపద్యము

తల్లిదండ్రుల సేవ!తప్పకుండా జేసి
    తరియించి రెందరో! ధరణి మున్ను

ఆదిదంపతులను!అర్చించి గణపయ్య
     త్రైలోక్య పూజ్యుడై!రమ్యమొందె
తండ్రియానతిపైన!తరుణితో గూడియు

వనవాస మునకేగె ఇనకులుండు

కన్నతండ్రి కొరకు కల్యాణమును వీడి
      గాంగేయుడవనిలో ఘనత గాంచె
తే.గీ
అంధు లైనట్టి తలిదండ్రి నాదరించి
కావడిన్ మోసెనిరతము శ్రావణుండు
జనని జనకుల మాటకై జంగమయ్య
భోజనంబయ్యె చిరుతొండ భూప సుతుడు

 




హనుమ గుణయుత !దయ!గను వనచర కపి
వర ,దశరథ సుతుని చరణములను
నిరతము కొలతువట కరువలి తనయుడ
మొరవిని దయగనుము దురిత హరణ!!

(గురువు లేకుండా )హనుమత్ స్తోత్రం
అంజయ్యగౌడ్ యస్కె నెంబర్ 501
కవిత 57


రవికిరణము శుభకరణము
అవనిలొగల జీవులకును అమృత కలశమై
అవిరలముగ గురుపించుచు
భవుడుగ శ్రీధవుడుగ అజభవుడుగ
తానై
ఆదివారంనాడు ఆదిత్యునికి నివాళి
(కందపద్యం)
అమరవాది కవిత సుమనోహరముగాను
యుండి దోచె కవుల నుల్లమెల్ల
మెతుకు సీమలోన ప్రతిభగల కవిగ
రాజశేఖరుడన రాటు వేలెత్తి
అంజయ్యగౌడ్

ధరణి మొరవిని గజపతి వరదు డిలను
ఎనిమిదవ తిదిని చెఱను ఇనుని వలెను
జననమునుగొనె మనసిజు జనకు డపుడు

మధుర పురమున దనుజుల మదము ననచ!!
తే.గీ
శ్రీకృష్ణునిజననము( సర్వలఘువు)
అంజయ్యగౌడ్ యస్కెనెంబర్ 501
కవితా సంఖ్య 58

     
అయుతకవితాయజ్ఞం యస్కె నెంబర్501  కవితసంఖ్య59
 🔯సర్వ లఘువు🔯
 🔯రామాయణం సీసపద్యం🔯

 దశరథ తనయుడు !తపసిగ వనముకు!
    తరలెను అతివతొ! పురము నొదలి

కనక మృగముగని!ఇనకులుడురుకగ
     అనుజుడు వెడలెను ! అతని కొరకు

తిరిపము నడగుచు !గరిమను చెరగొనె
    పది ముఖములు గల!బలు డసురుడు

వెలదిని గనకను విపినము దిరుగుచు
     ఇనకులుడు గలిసె!ఇనుని సుతుతొ
తే.గీ
హనుమ కనుగొనె, క్షితిసుత!నసుర పురిని

వనధి తనరియు కపులతొ !మనుజ విభుడు
అనియు సలుపగ దనుజుడు !అవని బడెను

ధరణి తనయతొ రఘుపతి! పురము కరిగె!!






అయుతకవితాయజ్ఙంఅంజయ్యగౌడ్
యస్కేనంబర్ 501
శీర్షిక శివస్తుతి  సంఖ్య 60 సీసపద్యం

రథమయ్యె ధరణి సా!రథిగమారెను విధి

నాల్గు వేదములాయే నశ్వచయము

మేటి కోదండమే మేరు పర్వతమయ్యె

అహిరాజు తానయ్యె అల్లె త్రాడు

సర్వోన్నతుడు శౌరి !సాయకముగ మారె

జయజయ ధ్వనితొ ముజ్జగము వేడ

శంఖము పూరించి ఘీంకారమును జేసి

దండెత్తి దనుజుల చెండి వైచి

తే.గీ

మూడు పురముల గాల్చిన మృత్యుజేత

ఉరగ భూషణ హరహర గరళ గళుడ

కరుణ జూపరా మా పైన గౌరి రమణ

శరణు శరణయ్య నీకిదె సాంబ శివుడ

త్రిపురాసుర సంహారం
అయుతకవితాయజ్ఞం
అంజయ్యగౌడ్  యస్కెనెంబర్501
శీర్షిక  *హనుమత్ స్తోత్రం*
కవితసంఖ్య61

     *  ఏకప్రాస*  కందపద్యములు

శ్రీ రామదూత ,మారుతి
కారుణ్యముతోడ మమ్ముగాపాడు మయా!
రారా!కపికుల తిలకా!
పారాయణ జేతు నీదు పావన నామం!! 1

వారిధి,దాటితివట,భవ
వారిధి,దాటించు నన్ను పవనకుమారా!
  వీరాగ్రగణ్య మారుతి,
ఏరీ?నీసాటివారు,ఇలలో హనుమా!!2

భారత,భూమినిగల,ఏ
వూరైనను నీవులేక వుండునె దేవా!
వీరాంజనేయ,ప్రభువర
పారావారా !బలయుత భజరంగభళీ!!3

కౄరుడు,మైరావణుతో
పోరాడియు వాన్నిజంపి భూమిజ పతియౌ!
శ్రీ రాముని,గాపాడిన
ధీరా! సుగ్రీవమిత్ర,తేజోమయుడా!!4

శ్రీ రామపత్ని, జానకి
హారమును బహూకరింప, ఆనందముతో!
హారమును పరీక్షించియు
నారాముడు లేడటంచు నలుపవె హనుమా!!
(నలుపుట=పగులగొట్టుట,)
అయుతకవితాయజ్ఙం యస్కెనెంబర్
501 అంజయ్యగౌడ్ కవితసంఖ్య62 *శీర్షిక* విద్య*
****సీసమాలిక****
విద్యచే మనుజుడు!విరజిల్లు భూమిపై
    విద్యయే మనుజుని! విత్తమయ్య

ఆస్తి పంపకమందు! ఆటంక మవ్వదు
      అంద చందముజూడ!దరువు పోదు

రాజ్యాధి పతికిని! రక్షక భటునికి
     మంత్రి సామంతులు !మాన్యులకును

కవులు గాయకులును!కమనీయ కావ్యముల్
  వ్రాయుటెల్ల చదువు! వల్ల గాదె

అంత రిక్షములను !అధిరోహనము జేయు
     శాస్త్ర విజ్ఞానముల్ !సర్వమిలను

తే.గీ .
విద్య చేతనే సిద్ధించు!విమల ముగను
  విద్య నేర్వుడి నరులెల్ల వినయ ముగను
సర్వ శాస్త్రముల్ విద్యచే !చదువ గలము
విద్య నేర్వని మనుజుడు!వింత పశువు!!


అయుతకవితాయజ్ఞం అంజయ్యగౌడ్ యస్కే నంబర్ 501
కవిత సంఖ్య 63 శీర్షిక(  అర్ధనారీశ్వర)  సీసపద్యము

పురహర నీవేమొ !పులితోలు గడితివి
      పట్టు వస్త్రము గట్టె !పార్వతమ్మ

నగవాస నీకేమొ! నగలయ్యె పాములు

బంగారు సొమ్ములు భామ బెట్టె

నీలకంఠా! నీకు నిలువెల్ల బూడిద
   గౌరమ్మ మే నెల్ల గంధ మద్దె

శీతాద్రి సుతకేమొ !సింహవాహన మాయె
        సాధు జంతువుపైన ,! స్వారి నీవు
తే.గీ  సప్త పాది

బిక్ష మడిగేవు నీవైతె బిడియ పడక

అన్నమిడు సర్వవేళల అన్నపూర్ణ

వల్ల కాడులో నీ యొక్క వసతి గృహము

మేడ లోపల తానుండె మేనక సుత

ఇన్ని భేదము లున్నను యీశ మీరు
ఇద్దరొకటిగ నుందురు యెల్ల వేల
అర్ద నారీశ్వరా నాదు అంజలిదుగొ!!

 
అయుతకవితాయజ్ఞం
తేది25-12-15
కవిత సంఖ్య-1కవిపేరు.అంజయ్యగౌడ్
అంశం-గణపతిస్తోత్రం
కంఠము
కారణజన్ముడగణపతి
వారణముఖ,దేవదేవవందితచరణా
నేరములెన్నకుమయ,మన
సారాసేవింతునిన్నైశంభునితనయా
ఆ.వె
అయుతకవితయజ్ఞ,మారంభమైనది
పంపవలెనుకవితలింపుగాను
అట్టిశక్తినొసగు. గట్టుతనయసుత
పట్టుకొందునీదు.పాదములను
అయుతకవితయజ్ఞం26-12-15
సహస్రకవి.501అంజయ్యగౌడ్
అంశం-:స్రీ.ఆ.వె
సుదతి లేనిగృహము శూన్యంబు నౌగద
మంచి చెడ్డలు భువి మగువ వలె
మగలకు విలువయు మర్యాద వెలదులె
రేణుకాంబ తల్లి రేణుకాంబ!!1
'సతిపతు,లిలలోన,సంతోషముగ నున్న
ఇంటిలోన ఎట్టి తంటరాదు
సిరుల,సంపదలచె స్థిరముగా వెలుగొందు
రేణుకాంబ తల్లి రేణుకాంబ2
మనిషి జన్మముందు మగువ ప్రదానము
తల్లి,చెల్లి,భార్య తనయ వౌచు
పురుషుని నడిపించు పుణ్యంబు నీలమ్మ
రేణుకాంబ తల్లి రేణుకాంబ3
(మద్విరచిత రేణుకాంబ శతకం)

అయుతకవితయజ్ఞం26-12-25
సహస్రకవి501అంజయగౌడ్
అంశం-సామాజికం
కులము
సీ.సురవేశ్య వూర్వశి,సూనుడౌ
వాశిష్టు
గురువయ్యెకమలాప్తు కులముకెల్ల
కొరకు బోయడె కాని కరమొప్ప వాల్మీకి
రామాయణము వ్రాసి,రమ్యమొందె
శశిచేత గురుపత్నిశిశువైన బుధుడింక
అంతరిక్షమునందు.అమరె ది విని
ఎరుక వంశజు డైన ఏకలవ్యుడుభువి
శరవిద్యలను పేర్చి శూరుడయ్యె
తే.గీ.జన్మ.జన్మలనరుడెట్టి చరితుడైన
కీర్తిగాంతురు సత్కర్మ ఆర్తివలన
శారదాక్షేత్ర నిలయేశ సాధు వినుత
జంగమార్చితా పరమేశ చంద్రమౌళి 1
వరకట్నవాంచతొ  వనితల బ్రతుకులు
అగ్నిహోత్రునిఇంటి కరుగనాయె
చక్కదనములోన చంద్రునిమించిన
పెక్కురూకలులేక పెండ్లిగాదు
సుందరవదనాన సురరాజు సతియైన
కల్యాణమేకాదు కాసులేక
సావిత్రి అనసూయ సతి అరుంధతి బోలు
పరమసుశీలైన పనికిరాదు
ఇప్పటి మనుషుల మమ్మేలయిలను త్రోసి
చూచుచుంటివిగమ్మత్తు శూలపౌణి"!!శారద!!




 అయుతకవితాయజ్ఙం27-12-15
 జంతుబలి   Sk
నెంబరు501అంజయగౌడ్
సీసపద్యము:-
అంగారకునిపైన అడుగిడె మనుజుడు
మూడభక్తినివీడ లేడు భువిని
చంద్రలోకము పైన చరణముల్ మోపిన
పశుబలిన్ మానరు పంతమేమొ
భూతాల పేరున జాతర్లు జేయించి
జంతు జాలము జంపి సంతసించి
అమ్మకు బలులంటు ఆరగింపులు జేసి
తాగితందానలు తప్పునడక
గీ!!మారుటెప్పుడో మానవుల్ మహితలంబు
బుద్ధినొసగియు బ్రోవరా భుజగహార
శారదాక్షేత్ర నిలయేశ సాధువినుత
జంగమార్చితపరమేశ చంద్రమౌళి
(మద్విరచితచంద్రమౌళీశ్వరశతకం)
అయుతకవితాయజ్ఞం యస్కె నంబర్501అంజయగౌడ్
జానపదం:-భార్య-భర్తముచ్చట
భార్య:-   ఓ ఓ నామొగడ ఒఢ్యాణము ఏది లో !!ఓ!@
వడ్లమ్మిన పైసలతో ఒఢ్యాణముదెస్తనాని!గుడ్డము కొంటున్నవాట గుర్తులేద పెళ్ళాము!ఓఓ! 1
భర్త:-  ఓ ఓ పెళ్ళామ,ఒఢ్యాణము ఎందుకే!ఓ! దొడ్డుగున్నవాల్లకైతె!ఒఢ్యాణము గావాలె!!నక్కవోలెనీనడుము!బక్కగుండె పెండ్లామ !గుడ్డము కొన్నామంటె!బిడ్డల కక్కెర కొస్తది!!ఓ!!
భార్య:-  అక్కెర ఉన్నప్పుడైతె బక్కనడుమె ,బనికొస్తది!!అ!!
ముక్కుపుల్ల దెస్తనాని మురిపిస్తా వప్పుడైతె!! కమ్మలు జేపిస్తనాని!
కమ్మగ మాట్లాడుతావు! నమ్మొద్దు మొగవారిని ,నట్టేట్లో ముంచుతారు
గుడ్డము ఏమొద్దుగాని ,ఒఢ్యాణము జేపియ్యి !!ఓఓ!!
భర్త:- అవ్వతోడు నువ్వంటె అధికమైన ప్రేమ నాకు!!అ!!నవ్వులాటకైనగాని నారాజు గాబోకె!! ఆలుగడ్డ అమ్మినంక అన్నిజేపిస్తగాని!గుడ్డము ఒద్దాని నువ్వు కోపానికి  రాబోకె!బయానిచ్చి ఊరుకుంటే బదనాము నేనైత!!ఓఓ@@
భార్య:-  నీ మాటనీదెగాని నా మాట వింటావ!ఎన్నిసార్లు మొత్తుకొన్నా
ఎప్పుడు యిదేమాట అప్పుడిప్పుడంటావు!తప్పించుకుంటావు ,!!వయసంతబోయినంక,వరుడెందుకన్నట్లు!!గుడ్డము ఏమొద్దు గాని ఒఢ్యాణము జేపియ్యి!!ఓ !!
భర్త:-  మొగడు మంచి గుంటెచాలు!నగలెందుకు పెండ్లామ !మొ!!నగలెక్కువ ఉన్నోల్లకు పగలైనను నిద్రరాదు!భుగులు భుగులు పడుకుంట బువ్వకూడ తినరుగదా !!నమ్మవె నామాట నీవు నాముద్దుల పెండ్లామ !!ఓ!@
భార్య:- బంగారం దెమ్మంటె దొంగల బాదంటావు!మొగడు మంచి గుంటె చాలు నగలెందు కంటావు!! చాతగాని మాటలైతె చాన్నే జెప్తావుగాని! ఈపాటిమొగడేమొ ఎవ్వరికి లేనట్లు! నీలోనె నీవెమురసి నీల్గుతావురా మొగడా !@ఓ!!
భర్త:-  బంగారం మీదయింత భ్రమ ఎందుకు పెండ్లామ!!శృంగారములోన నిన్నుసుఖ పెడితేచాలుగదా!!
మందిమాట బట్టు కోని మాట్లాడకు నీవిట్ల!కందులమ్మి నంకనీకు కాల్లాకడియాలుదెస్త!తొందరపడినీవునన్ను నిందమాటలాడబోకె!!ఓ!!


[02/01 16:21] Anjaiah Goud: అయుతకవితయజ్ఞం
యస్కె నెంబరు501 అంజయ్యగౌడ్
జానపదం(వలసపోయే భర్త ఆవేదన)
పల్లవి:- ఇగనేను పోతున్ననె పెండ్లామ! ఇల్లిడిచి పోతున్ననే పెండ్లామ !
ఇల్లిడిచి పోతున్ననె పెండ్లామ! నిన్నిడిచి పోతున్ననె పెండ్లామ !!ఇ!! 1

చరణం
ఇగనేను బోతున్న ఇల్లుగట్టినబాకి !! ఇరవై వేలకు,ఇజ్జతు బోవట్టె !!2!!
ఇచ్చిన శావుకారి ఇబ్బంది పెడుతుండు !!2!అది చూచి పాలి వారంత నవ్వు చుండ్రి!!ఇ!!

అయ్య సంపాంచిన ఆస్తి లేదునాకు!అవ్వకూడ ఏమి కూడబెట్టగలేదు !
అన్నదమ్ముల కష్టమస్సలే ఎరుగను!!రెక్కలాడితెగాని  డొక్కనిండని బ్రతుకు!
అందుకే ఊరిడిచి హైద్రాబాదు దిక్కు!!2
అత్తగారి సొమ్ము అచ్చిరాకపోయె !బావమరుదుల సొమ్ము బాకి లేదునాకు!
అక్కచెల్లెండ్లయితె ఆమడదూరము
చుట్టాలుపక్కాలు  పట్టించుకోరాయె!
ఎట్టూలయీబాకి నేను తేర్పుదునమ్మ
అందూకె ఊరిడిచి హైద్రాబాదు దిక్కు!!ఇ!!3

మామకు కొలువుండె మండలాఫీసులోన!
అత్తపని జేస్తాది ఆసుపత్రిలోన
వారిద్దరికి నెలకు  యాభైవేలొస్తాయి
అత్తమామలనడిగి!అప్పుదెస్తానని!
పొద్దుమూకబోయి ఇద్దరిని అడిగితే
ఇంటిలోపలి నుండి గెంటివేసిరి నన్ను!ఇ@!4
[02/01 16:21] Anjaiah Goud: నీ అన్నదమ్మూలు  నీల్గుడు పుంజూలు!మరియాద కైనను,మాటలాడరుగాని
బావ బాగున్నవని పలుకరించరుగాద !!అయినను నాకేమొ ఆపదొచ్చి నపుడు!
అప్పుకోసము నీదు అన్నల నడిగితె!కొప్పుబట్టినన్ను కొట్టిరే ఓ పిల్ల!!5

నీ తోటి సుఖముగా నేను ఉందామంటె!! బట్టల్లేవంటావు,
బాధేమొపెడ్తావు !నగలులేవంటావు నలుగురికి జెపుతావు! సాదలేనోనికి సతి ఎందుకంటావు!!
మూతివంకర దిప్పి ముడుచుకొని పంటావు! అందుకే నిన్నిడిచి హైదరాబాదుకు!!ఇ!!6
నామొగడె లేడాయె  నాకేమిఎదురాని! తల్లిగారింటికి తరచుగా పోబోకె!
చులకనైపోతావు చూడరె మంచిగా
ఉన్నదో లేనిదో ఉడికిన కూడింత
తినుకుంటు మనయింట్ల తిన్నంగ ఉండాలే! పిల్లలు పైలమే మల్లనేనొచ్చెదాక!!ఇ!!7
అయుతకవితాయజ్ఙం యస్ కెనంబర్501
నారాయణస్తోత్రం(యక్షగానము)
భూదేవి శ్రీహరిని శరణు వేడుట(ఆదితాలం)
రక్షింపు మయ్య ,రక్షింపుమయ్య,రామేశా!!ర!!
పక్షీంద్రగమన పాలించవయ్య పరమేశా!
జలజాక్ష కలియుగము నందు గల్ల జనులెల్లా! బలువైన పాపములు జేయుచుండ్రి విలసిల్ల!!1
శ్రీపతి ఎట్టులైనాను  వేగిరామూన!
పాపవిద్వంసమును జేయుమయ్య ఖగ గమన!
కారుణ్యమూర్తీ అంజయ్య దాస సంరక్షా!
పేరోందు వేంకటారావు పేట మీనాక్షా!!ర!!
అంజయ్యగౌడ్
మద్విరచిత వేంకటేశ్వర కల్యాణం
(అముద్రితము)

అయుతకవితాయజ్ఙం
అంజయ్యగౌడ్ యస్ కె నెంబర్ 501 దేవతా స్తోత్రం
సీసపద్యము
పాలవారధిపైన ! పవ్వలించినవాని
సతిసోదరునిముద్దు! సఖియ తండ్రి
ముద్దుసుత ,ప్రాణేశు! పూజించు నవ్వాని!
పుత్రుని సతితండ్రి! బువ్వయైన
వానివరముచేత !జనన మొందినవాని!
చేతిలో జచ్చిన!భూతలేశు
మేనకోడలుభర్త !మేనమామనుగన్న
వాని సోదరి పెద్ద! తనయు తండ్రి!!
తే.గీ.
వరమునను బుట్టి,నవ్వాని!వనిత బావ!
ప్రాణముల్ దీసె పదునైన!బాణమేసి
అట్టి,ప్రభుకీర్తనల్ బాడు!అమిత బలుని!
పగలు రేయనకుండ !బ్రస్తుతింతు!!
         * భావము*
పాలవారధిపైన శయనుడు శ్రీమహావిష్ణువు విష్ణువు భార్య లక్ష్మి
లక్ష్మిసోదరుడు చంద్రుడు చంద్రుని
ప్రియమైనభార్య రోహిణి రోహిణీతండ్రి
దక్షుడు దక్షునిబిడ్డ సతీదేవి సతీదేవి భర్త శంకరుడు శంకరుని పూజించినవాడు రావణుడు రావణుని కొడుకు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుభార్య సులోచన తండ్రి నాగరాజు నాగరాజు ఆహారం వాయువు (గాలి) వాయువరమున బుట్టిన వాడు భీముడు భీమునిచే చచ్చినవాడు కీచకుడు కీచకుని మేనకోడలు ఉత్తర  ఉత్తర భర్త అభిమన్యుడు అభిమన్యుని మామ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు వసుదేవుని సోదరి కుంతి కుంతిపెద్ద కొడుకు కర్ణుడు కర్ణుని తండ్రి సూర్యుడు సూర్యుని కుమారుడు సుగ్రీవుడు సుగ్రీవుని భార్య రుమ రుమ బావ వాలి వాలిని
చంపినవాడు శ్రీరాముడు శ్రీరాముని కీర్తించెడి వాడు శ్రీ ఆంజనేయుడు అట్టి ఆంజనేయ స్వామిని ఎల్లప్పుడు
ప్రస్తుతి చేస్తాను అని భావము








   రూపాయి తిరకాసు(జి.భ్రమరాంబగారికవితకు)దగ్గరగా
కందపద్యం
విత్తము గలిగిన చాలును
వత్తురు బాంధవుల మనుచు వరుసలు గలిపీ!
విత్తంబుడిగినమన,ఊ
సెత్తరు నిజబంధువర్గ మెవ్వరు గానిన్
అంజయ్యగౌడ్


అయుతకవితాయజ్ఙం యస్ కెనెంబర్ 501అంజయగౌడ్
శీర్షిక సంక్రాంతి శోభ కవిత సంఖ్య   51
తే.గీ
తెలుగు లోగిళ్ళు సంక్రాంతి వెలుగు లీనె
రంగవల్లులు తీర్చిన ముంగిలులలొ
ఆవు పేడతో గొబ్బెమ్మ లందముగను
పసుపు కుంకుమ దిద్దియు పరచినారు
కం: హరినామము స్మరియించుచు
హరిదాసులు  వీనులలర "హరిలోరంగా"
"హరిలోరంగా" హరి యని
తిరుగుచు వాకిల్లలోన తిరిపము కొరకై!!
ఆ.వె








 
అయుతకవితాయజ్ఞం యస్కె నెంబర్501 అంజయ్యగౌడ్
(భరతమాత)  మేఘవిస్ఫూర్జిత వృత్తము
పవిత్రంబయ్యెన్ !నాదుతనువిక ఈ భారతంబందు !బుట్టన్
వివేకానందుండాది,ప్రముఖులు గాంభీర్య బ్రహ్మన్నలున్,సం
భ ,వించారిచ్చోటన్ భుజబలులు విబ్రాజ్యులౌ వీరులున్ ,స
త్కవీంద్రుల్ నానాశాస్త్రములు యితివృత్తంబులున్ నుద్భవించెన్

అన్నా!మధుసూదనా నిన్ను చూచి
నేను ప్రయత్నించాను కావున ఆమూలగ్రముగా పరిశీలించి పొరపాటు జరిగితే సవరంచి మీ అమూల్యమైన అభిప్రాయంతెలియజేయ గారు
తమ్ముడు అంజయ్యగౌడ్

[06/11/2015 10:59] Anjaiah Goud: శీర్షిక .
తెలుగువెలుగు
కం..ఒకకవినొకపద్యముతా
ప్రకటితముగ వ్రాయచాలు ప్రామాణిక మై
చకచకమెరయును.ఔరా
వికటించియుఆంగ్లభాషవెలవెలబోవున్
 S.K.No501.
బి.అంజయ్య గౌడ్.
వెంకట్రావ్ పేట
మం.తొగుట జి.మెదక్
కవిత సంఖ్య. 2
[06/11/2015 11:00] Anjaiah Goud: తెలుగుకు ప్రాణము పద్యము
తెలుగులొఒకపద్యమైనదేదీప్యముగా
మలచిన చాలయమీరలు
అలరారునుతెలుగుభువినిఅజరామరమై
SK.no501
 బి.అంజయ్య గౌడ్
9963418686
అయుతకవితాయజ్ఙం

అంజయ్యగౌడ్ యస్ కెనెంబర్501
కవితసంఖ్య 64 శీర్షిక

 తెనాలిరామకృష్ణయుక్తి

కం. శ్రీ కృష్ణ దేవరా యలు
ప్రాకటముగ విజయనగర  ప్రభువై యుండన్
లోకోన్నత సభయెదుటకు
చీకాకగు తగు వొకటియు జేరెను త్వరగన్  1
ఆ.వె
మగడు గొట్టుచుండ మగువ రోదించుచు
కావుమనుచు ప్రభుని కాల్లు మ్రొక్కె
ఎందుకిటుల నీవు ఇంతిని గొట్టేవు
జెప్పుమనుచు మగని తప్పుబట్టె 2

(అంత మగువ మగడు)కందము

ఏమని జెప్పుదునయ్యా
కామముతో కళ్ళుగప్పి, క్షణిక సుఖముకై
భామామణి పర పురుషుల
ప్రేమలొ తిరుగాడుచుండె భీతియు లేకన్ 3

  (రాజు మగువతో)
కం.  నిజమా? నీమగడన్నది
గజగామిని దెల్పుమనుచు గద్దించంగన్
గజగజ వణుకుచు బలికెను
అజరుద్రుల సాక్షి ఎట్టి అఘమెరుగ ననెన్ 4
   రాజు
ఏ పాపంబెరుగ ననుచు
నీ పడతియు బల్కుచుండె నీచాత్ముడవై
రాపేల జేయు చుంటివి
పోపోమ్మిక నీ పడతిని పోషించు మికన్ 5

క. చండాలుని గూడినదీ
ముండా? దీన్నెట్లు నేను పోషింతునయా
కొండెపు మాటలు గావివి
ఖండలుగా గోయుడినను కల్లలు నైనన్ 6

       రాజు సభవారితో
కం. నారీమణి చండాలుడు
మారుని కేళిని సలపిన మర్మంబిచటన్
ఏరీతిగ నిర్ధారణ
ఈ రోజున జేయుదమిక ఈ సభలోనన్ 7

(అంతట న్యాయాధి కారులు)

కం.బాగొప్పగ చండాలుతో
భోగించగ లేదనుచును పూబోణి యిటన్
క్రాగెడి నూనె కళాయిలొ
రాగీ ఉంగరము దీయ రాజిల్లు రన్

కం.లలణామణి బలుమారులు
పలికెను చండాలుగూడి పవళించ ననెన్
పలువురు చూడగ నూనె లొ
వెలది కరము ముంచిదీయ వేడిచె ప్రొక్కెన్

కం..అదిగని యాశ్చర్యముగా
సుదతిని నిందించినారు చూపరు లెల్లన్
పృధివీపతి ఇదియేమని
ముదితను గని కోపమొందె ముక్కంటి వీవెన్

స్ర్తీ.కం. పతినిడచియు వేరెవరిని
రతికేళిని గూడలేదు రారాజేంద్రా
రతిపతి జనకుని సాక్షిగా
పతియే నాదైవమనుచు వరలిన దానన్
ఆ.వె
దిక్కుతోచలేక దేవరాయ ప్రభువు
రామకృష్ణువంక మోము ద్రిప్పి
తగువు దీర్చు మనుచు తగసైగ జేసెను
గట్టివాడ వనుచు పట్టు బట్టె
ఆ.వె

రామకృష్ణుడంత రమణి తోడ మరల
తైల భాండ్వకడకు దరలి పోయి
సఖియ నీదు మగడు చండాలుడైనచో
కాలకుండు ననుచు కరము నుంచు

కం
హరహర శివ శివ ఈ నా
వరుడే చండాలుడైన వాసిగ నా ఈ
కరమును కాల్పక సత్యము
సరగున జూపించు మనుచు సాధ్వియు వేడెన్

కం.

మును గాలిన వనిత కరము
మనసిజు రిపుకరుణ చేత మంచిగ మారెన్
మను జేంద్రుండది గనియును
వనితను శ్లాఘించినాడు వహ్వాయనుచున్

రాజు  కం

నీ వనిత సుశీల యనుచు
ఈ వసుధను తెల్లమయ్యె యిపుడే
మనెదౌ
నీవే చండాలుడవై
ఈ విధముగ నిందమోపి హింసించితి వౌ

భర్త..కం

నా తప్పేమియు లేదాయ
మాతల్లియు జెప్పినట్టి మాటలు వినియున్
నా తరుణిని బాధించితి
భూతలనాయక క్షమించు బుద్ధియు వచ్చెన్

వ..అత్తగారిని బిలిపించి రాజు

కం:- అమ్మా నీ తనయుండే
ఇమ్మహి చండాలుడయ్యె యేమిటి విషయం
కొమ్మను బాధించిన ఫలి
తమ్మున,మీ ఇద్దరినిట దండింతు నికన్

కం... ప్రజలందరు వినునట్టుల
నిజమేమిటొ దెల్పకున్ననేరస్తులుగా
విజితమ్మగ నెంచియు ఈ
గజములచే ద్రొక్కించెద కరుణయు లేకన్

కం...పుడమీపతి పలుకులకును
గడగడ వణకుచును రెండు కరములు మోడ్చీ
బడసితి చండాలునకే
బుడుతడుగా వీడినంచు ముసలిది దెలిపెన్

ఆ.వె

ఆంధ్ర భోజుడంత ఆ రామకృష్ణుని
మెచ్చుకొనుచు కానుకిచ్చినాడు
ఆలుమగల బిలిచి ఆనందముగ,జీవి
 తమును, గడుపుమనెను ధర్మ ప్రభువు

తే.గీ

రామ లింగని యుక్తిని రమ్యముగను
పద్యముల యందు వ్రాసితి పండితులును
తప్పులున్నను దిద్దుడీ దండమిదిగొ
తనయుడనుచును దలపోసి ధరణి లోన

సాహితి కిరణము మాస పత్రికలో
ప్రచురితమైనది












ఇది తెనాలి రామకృష్ణ కథలు అందులో  ఒకకథను పద్యాలుగా
అల్లినాను కవులందరూ చదివి తమతమ అభిప్రాయాలు తెలియ జేయగలరు

అంజయ్యగౌడ్ బండకాడి
అయుతకవితయజ్ఞం26-12-25
సహస్రకవి501అంజయగౌడ్
అంశం-సామాజికం
కులము
సీ.సురవేశ్య వూర్వశి,సూనుడౌ
వాశిష్టు
గురువయ్యెకమలాప్తు కులముకెల్ల
కొరకు బోయడె కాని కరమొప్ప వాల్మీకి
రామాయణము వ్రాసి,రమ్యమొందె
శశిచేత గురుపత్నిశిశువైన బుధుడింక
అంతరిక్షమునందు.అమరె ది విని
ఎరుక వంశజు డైన ఏకలవ్యుడుభువి
శరవిద్యలను పేర్చి శూరుడయ్యె
తే.గీ.జన్మ.జన్మలనరుడెట్టి చరితుడైన
కీర్తిగాంతురు సత్కర్మ ఆర్తివలన
శారదాక్షేత్ర నిలయేశ సాధు వినుత
జంగమార్చితా పరమేశ చంద్రమౌళి 1


వరకట్నవాంచతొ  వనితల బ్రతుకులు
అగ్నిహోత్రునిఇంటి కరుగనాయె
చక్కదనములోన చంద్రునిమించిన
పెక్కురూకలులేక పెండ్లిగాదు
సుందరవదనాన సురరాజు సతియైన
కల్యాణమేకాదు కాసులేక
సావిత్రి అనసూయ సతి అరుంధతి బోలు
పరమసుశీలైన పనికిరాదు
ఇప్పటి మనుషుల మమ్మేలయిలను త్రోసి
చూచుచుంటివిగమ్మత్తు శూలపౌణి"!!శారద!!